ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కరోనాపై పోరాడుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, 79 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమించామన్నారు. అలాగే కరోనా శాంపిల్స్‌ సేకరణ కూడా వేగంగా కొనసాగుతోందన్నారు. వలస కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర చర్యలు చేపట్టిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మూడు నెలలు ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. కరోనాపై డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నామని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్త నివేదికల ప్రకారం.. కరోనా వైరస్‌ ఎక్కువగా వృద్ధులకు సోకుతోందన్నారు.

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాల సంఖ్య 20కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 180 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నొయిడాలో కొత్తగా ఐదుగురు కరనా బారినపడ్డారు. కశ్మీర్‌లో ఏడుగురికి కరోనా సోకింది.

Also Read: అలవాటైన చేతిని ఎక్కువ వాడకండి ..

తెలంగాణలో 65 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. 24 గంటల్లో 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్‌లో 20 వేల మంది ఉన్నారు.

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. మొత్తం లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు మూడుకు చేరుకున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.