రూ.2 వేల నోటు రద్దుపై.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మాటల్లో..

By అంజి  Published on  16 Feb 2020 12:05 PM GMT
రూ.2 వేల నోటు రద్దుపై.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మాటల్లో..

హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్తలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందర్నీ సంప్రదించాకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. బడ్జెట్‌ పెట్టిన తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా వెళ్లామని.. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చామని.. తర్వాత బెంగళూరు వెళ్తామన్నారు. ఒక్కో సిటీలో పారిశ్రామిక వేత్తలను కలిసి బడ్జెట్‌పై చర్చిస్తున్నామన్నారు. వివిధ సిటీలు, ట్రేడ్‌ బాడీస్‌, ఎకనామిక్‌, పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నట్లు కేంద్రమంత్రి నిర్మల తెలిపారు. ట్రైడెంట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం సదస్సులో ఆమె పాల్గొన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గలేదన్నారు. ఏ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడాలనే ఉద్దేశం ఉండదని ఆమె అన్నారు. తాను కూడా తెలంగాణ నేతలు మాట్లాడినవి విన్నానని, సెస్‌ కలెక్షన్‌ తక్కువ కావడంతోనే రాష్ట్రాలకు జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులనే పాటిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు మాత్రమే కాదని.. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని నిర్మల పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆర్థిక వృద్ధిలో మెరుగ్గానే ఉందని అన్నారు. తర్వలో జీఎస్టీ నిధులిస్తామని, సెస్‌ వచ్చే కొలది ఇస్తూనే ఉంటామని ఆమె తెలిపారు. తెలంగాణకి రూ.4 వేల కోట్లు ఇవ్వాలన్న మాట అవాస్తవమన్నారు. రూ.2వేల నోటు రద్దు అవుతుంది అనే మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సత్సబంధాలు కలిగి ఉండడమే కేంద్రం ప్రభుత్వ విధానమన్నారు.

Next Story