యుఎంజిఏ వేదికగా తలపడనున్న ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 5:42 AM GMT
యుఎంజిఏ వేదికగా తలపడనున్న ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్

ఐక్య‌రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒకే వేదిక పంచుకోనున్నారు. అక్కడ వీరు ఒకరి తరువాత ఒకరు మాట్లాడనున్నారు. భారత్ పధాని మోదీ మాట్లాడిన తరువాత ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతారు.

ప్రధాని మోదీ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా ఉగ్రవాదం.. శాంతి.. డెవలప్ మెంట్ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తీసుకుంటున్న చర్యలు .. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల విషయంలోనూ మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. మోదీ ప్రసంగం ముగిసిన తరువాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగించనున్నారు. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత .. పాకిస్థాన్ ప్రధాని భారత నిర్ణయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే తిప్పికొట్టింది.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పదే పదే ఉగ్రవాదం నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం ఉగ్రవాదం మీద కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. అమెరికా కేంద్రంగా సాగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదిక మీద ఇమ్రాన్ సమక్షంలో మోదీ ఏం మాట్లాడుతారు, ఆ తరువాత మాట్లాడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఏ రకంగా స్పందిస్తానేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

సార్క్ సమావేశంలోనూ భారత విదేశాంగ మంత్రితో కలిసి చర్చలు జరపడానికి పాకిస్తాన్ నిరాకరించింది. కాశ్మీర్ అంశంలో భారత్ తీరు కు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ మంత్రి ప్రకటించారు. అయితే.. భారత్ మాత్రం తమ వైఖరి స్పష్టంగా ప్రకటించింది. కశ్మీర్ అంశం పూర్తిగా తమ అంతర్గత విషయమని..ఇందులో ఎవరి జోక్యం..ప్రమేయం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది.

Next Story