తెలుగు ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

YS Jagan wishes Telugu people on the ocassion of Ugadi. తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్‌ ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat
Published on : 21 March 2023 7:30 PM IST

తెలుగు ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

YS Jagan wishes Telugu people on the ocassion of Ugadi


తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్‌ ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అభిలషించారు. శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు.


Next Story