కోవిడ్ టెస్టుల్లో రకాలు - ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 1:55 AM GMT
కోవిడ్ టెస్టుల్లో రకాలు - ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

1. RT-PCR టెస్ట్ : ఈ పరీక్ష ని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం

2. Rapid - Antigen Test : ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం . నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి

3. HRCT-LUNGS (సిటి స్కాన్ )కూడా ముఖ్యమైన టెస్ట్

Antigen లో నెగిటివ్ వచ్చిన, Hrct-chest లో పాజిటివ్ వచ్చిన కేసులు చాలా వున్నాయి..

HRCT లో ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎంత వుంది.. స్కోరింగ్ కూడా రిపోర్ట్ లో వస్తుంది.. ఇది కూడా ముఖ్యమైన పరీక్ష..

4. Anti Body Test : ఈ పరీక్షని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది కాదు. కావున క్రియాశీల COVID ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎప్పుడూ చేయించుకోకండి.

Next Story