అంతుచిక్కని కరోనా ఆరు రకాలా..? అవేమంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 8:29 AM GMT
అంతుచిక్కని కరోనా ఆరు రకాలా..? అవేమంటే..?

ప్రపంచాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్న కోవిడ్ -19 ఒక పట్టాన అంతుచిక్కటం లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్స్ పరిశోధకులు గుర్తించిన విషయాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. దాదాపు 1600 మంది కరోనా రోగులపై అధ్యయనం చేయగా.. పలు విషయాలు వెలుగు చూసినట్లుగా పేర్కొన్నారు. కరోనా సోకినప్పటికి ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే బాగుంటుందని.. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయాలని కోరుతున్నారు.

తాజా అధ్యయనంలో వెలుగు చూసిన ఆరు రకాల కరోనా ఏమిటన్న విషయంలోకి వెళితే..

1. జ్వరం లేకుండా సాధారణ ఫ్లూ. సాధారణ జలుబు. గొంతు నొప్పి.. ముక్కు దిబ్బడ.. ఛాతీనొప్పి..స్వల్ప తలనొప్పి.. వాసన గ్రహించలేకపోవటం లాంటివి. వీటికి హోం ఐసోలేషన్ తో పాటు.. కొద్దిపాటి మందులు సరిపోతాయి.

2. జ్వరంతో కూడిన కోవిడ్ -19 లక్షణాలు. పొడి దగ్గు.. గొంతునొప్పి.. గొంతు బొంగురుపోవటం.. తలనొప్పి.. వాసన కోల్పోవటం. ఈ సమస్యలకు హోం ఐసోలేషన్ లో ఉండి.. చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

3. ఆహారం జీర్ణం కాకపోవటం. వికారంగా ఉండటం. వాంతులు.. విరేచనాలు.. దగ్గు.. తలనొప్పి.. స్వల్పంగా ఛాతీ నొప్పి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకోవటం చాలా ముఖ్యం. వెంటనే రోగ నిర్దారణ పరీక్ష చాలా అవసరం.

4. తీవ్రమైన ఆలసట. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం.. ఎక్స రే. సిటీస్కాన్ తో ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ ను గుర్తించే వీలుంది. తీవ్రమైన తలనొప్పి. జ్వరం ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో వైద్యం తీసుకోవటం చాలా తప్పనిసరి.

5. కండరాలు.. ఛాతీనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లటం అవసరం.

6. కడుపు నొప్పి.. శ్వాసకోస సమస్య. ఆక్సిజన్ స్థాయి పడిపోవటం. ఇలాంటి వారిని కచ్ఛితంగా ఆసుపత్రికి తరలించాలి. వెంటనే ఐసీయూలో ఉంచి ఆక్సిజన్.. వెంటిలేటర్ చికిత్స కూడా అవసరం. ఇది అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు.

Next Story