ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మానే సంజీవని : చిరంజీవి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 12:56 PM GMT
ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మానే సంజీవని : చిరంజీవి

కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన యోధులను సైబరాబాద్‌ పోలీసులు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరై మాట్లాడారు. ప్లాస్మా దానంపై ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని, మీరు ప్లాస్మా దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్‌ లాస్‌ జరగదన్నారు. ప్రస్తుతం కరోనా మందులేని ఇలాంటి తరుణంలో ప్లాస్మా దానం సంజీవనిగా మారిందని అభివర్ణించారు. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99శాతం బతికే అవకాశముందన్నారు. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా నుంచి కోలుకుంటారని, ఒకరి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చునని తెలిపారు.

మా బంధువు ఒకరు కరోనా సోకి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. స్వామినాయుడు అనే వ్యక్తి ప్లాస్మా దానం చేశారని చిరంజీవి వెల్లడించారు. ప్లాస్మా చికిత్స అనంతరం తమ బంధువు కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు. ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టపోతామన్న అపోహ వద్దని, ఒక రోజు నుంచి రెండ్రోజుల్లోపల తిరిగి ఆ రక్తం భర్తీ అవుతుందని తెలిపారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

Untitled 2 Copy

సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. తలసేమియా రోగుల కోసం సైబరాబాద్‌ పోలీసులు మొదలు పెట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో త‌మ‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి పని చేశార‌ని చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా రక్త దానం చేశారని తెలిపారు. ప్లాస్మా దానం చేస్తే మళ్లీ కోవిడ్ వ‌స్తుంద‌నేది అస‌త్య‌మేనని, దీనిపై ఎవ‌రూ అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్లాస్మా దానం చేసిన వారికి మళ్లీ కరోనా సోకినా లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినా వారికి ప్లాస్మా చికిత్సలో ప్రాధాన్యత ఇస్తామన్నారు.

Next Story