టాప్‌ 10 జాబితాలో 'సినీ' స్టార్లు

By సుభాష్  Published on  28 Dec 2019 9:58 AM GMT
టాప్‌ 10 జాబితాలో సినీ స్టార్లు

సోషల్ మీడియాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ దూసుకుపోతున్నారు. 2019 సంవత్సరంలో ట్విట్టర్ మొదటిస్థానంలో నిలిచారు. ఇక హీరోయిన్లలో సోనాక్షి సిన్హా టాప్‌ రేంజ్‌లో ఉన్నారు. 2019లో సినీ ఇండస్ట్రీ నుంచి టాప్‌ 10 జాబితాను ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. ఇక నటుల్లో అమితాబ్‌ తర్వాత అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఉన్నారు. తమిళ నటుడు ఐదో స్థానంలో ఉండగా, ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకుంటే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 9వ స్థానంలో నిలిచాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ 6వ స్థానంలో ఉండగా, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ 7వ స్థానంలో ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ 8వ స్థానం, తమిళ డైరెక్టర్‌ 10వ స్థానంలో నిలిచారు. ఇకపోతే మహిళల్లో సోనాక్షి తర్వాత అనుష్క శర్మ, లతా మంగేష్కర్‌, అర్చన కల్పతి, ప్రియాంకా చోప్రా ఉన్నారు. అలియా భట్‌ 6వ స్థానం, కాజల్‌ అగర్వాల్‌ 7వ స్థానం, సన్నీ లియోస్‌ 8వ స్థానం, మాధురి దీక్షిత్‌ 9వ స్థానం, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 10వ స్థానంలో నిలిచారు.

నటుల్లో అమితాబ్‌ తర్వాత అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. తమిళ హీరో విజయ్‌ 5వ స్థానంలో నిలిచారు. తెలుగు హీరో మహేష్‌బాబు 9వ స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ 6, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ 7, అజయ్‌ దేవగన్‌ 8 స్థానాల్లో ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ 10వ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక మహిళా ప్రముఖుల్లో సొనాక్షి తర్వాత అనుష్క శర్మ, లతా మంగేష్కర్‌, అర్చనా కల్పతి, ప్రియాంకా చోప్రా ఉన్నారు. అలియా భట్‌(6), కాజల్‌ అగర్వాల్‌(7), సన్నీ లియోన్‌(8), మాధురి దీక్షిత్‌(9), రకుల్‌ప్రీత్ సింగ్‌‌(10) టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు.

హాష్‌ ట్యాగ్‌ ఆధారంగానే ఎంపిక

#ThisHappened2019 అనే హాష్‌ ట్యాగ్‌తో ఈ ఏడాది అధికంగా ట్వీట్‌ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. సినిమా, క్రీడా, రాజకీయ, ప్రభుత్వ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖల్లో ఎవరి గురించి ఎక్కువ ట్వీట్లు వచ్చాయో దాని ఆధారంగానే జాబితాను ప్రకటించింది. ఇక రాజకీయాల్లో ప్రధాని నరేంద్రమోదీ, క్రీడల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌లో ఉన్నట్లు ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది.

Next Story
Share it