నా కూతుర్ని చూస్తుంటే గర్వంగా ఉంది.. ‘శరత్ కుమార్’

నటుడు శరత్ కుమారు తన కూతురు వరలక్ష్మి కి అవసరం ఉన్న సమయంలో ఆదుకోలేక పోయానని తెలిపారు. శింబు హీరోగా నటించిన ‘పోడా పోడా’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నటి వరలక్ష్మి. తెలుగు, తమిళ్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తిపు తెచ్చుకున్నారు. . ఈ సందర్భంగా నటుడు శరత్ కుమారు మాట్లాడుతూ తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు.

పోడా పోడా సినిమా విడుదలకు కోసం నా కూతురు వరలక్ష్మి కొంత కాలం ఎదురు చూడవలసి వచ్చిందని ఆ సమయంలో ఒక తండ్రిగా నేను సహాయం చేసి ఉంటే బాగుండేదని..  ఆ విషయంలో ఇప్పటికి భాద పడుతునే ఉంటానన్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ వరలక్ష్మి కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో రాధిక కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమాలో శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్