ట్విట్టర్ వర్సెస్ ట్రంప్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 5:17 AM GMT
ట్విట్టర్ వర్సెస్ ట్రంప్

రెండు నెలలుగా కోట్లాది మంది ప్రజల్ని హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ చైనా లోని వుహాన్ ల్యాబ్ లో పుట్టిందని, చైనా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేకే ఇలా వైరస్ ను తయారు చేసి దానిని ప్రపంచమంతా వ్యాపించేలా చేసిందని ప్రపంచ పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా చైనా అమెరికా కు మధ్య వాగ్వాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ ను తప్పుపడుతూ ట్రంప్ చేసిన ట్వీట్ పై ట్వి[ట్టర్ మొట్టమొదటిసారి ఫ్యాక్ట్ చెక్ వార్నింగ్ పంపింది.

కాలిఫోర్నియా గవర్నర్ లక్షలాది మంది శరణార్థులకు మెయిలింగ్ బ్యాలెట్స్ పంపుతున్నారని..ఇలా బ్యాలెట్స్ పంపడం వల్ల అవి దోపిడీకి గురవుతున్నారని ఆరోపిస్తూ ట్రంప్ ట్వీట్లు చేయగా..ట్విట్టర్ ఈ ట్వీట్లపై స్పందించింది. తొలిసారి ట్రంప్ ట్వీట్లపై స్పందించిన ట్విట్టర్ ట్రంప్ చేసిన ట్వీట్లలో తప్పుడు సమాచారం ఉందని, ముందు మెయిలింగ్ బ్యాలెట్ వాస్తవాలను తెలుసుకోవాల్సిందిగా ట్విట్టర్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ఈ ట్వీట్లు ఎన్నికల సమాచారాన్ని తప్పు పట్టే విధంగా ఉందంటూ పేర్కొంది.



కాగా..ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ వార్నింగ్ ఇవ్వడంపై ట్రంప్ మండిపడ్డారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ అనవసరంగా జోక్యం చేసుకుంటోందని..ఒక అధ్యక్షుడిగా తాను ఇలాంటి వాటిని అసలు అనుమతించబోమంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా..గతంలో ఇతర దేశాలపై, కోవిడ్ 19 వాస్తవాలపై ట్రంప్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ట్విట్టర్ ఇలాంటి వార్నింగ్ ఎన్నడూ ఇవ్వలేదు. ఇప్పుడు ట్రంప్ ట్వీట్లపై ట్విట్టర్ స్పందించడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది.



Next Story