కొడుకును చంపిన పుట్‌బాల్ ప్లేయ‌ర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2020 7:30 AM GMT
కొడుకును చంపిన పుట్‌బాల్ ప్లేయ‌ర్‌

కొడుకు అంటే త‌న‌కు ఇష్టం లేదంటూ ఓ పుట్‌బాల్ ప్లేయ‌ర్ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. క‌న్న‌కొడుకును దిండుతో ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త‌‌మార్చాడు. ట‌ర్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కెవెర్ టోక్టాస్ ట‌ర్కీ పుట్‌బాల్ ఆట‌గాడు. అత‌డి కుమారుడు ఖాసిమ్ లో క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో కుమారుడిని ఏప్రిల్ 23న ఓ ఆస్ప‌త్రిలో చేర్పించాడు. క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించగా నెగిటివ్ అని వ‌చ్చింది. ఎందుకైనా మంచిద‌ని ఐసోలేష‌న్ వార్డులో ఉంచి ఖాసిమ్‌కు చికిత్స అందిస్తున్నారు. బాబుకు స‌హాయ‌కుడిగా టోక్టాస్ కూడా ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. ఈ నెల 4న టోక్టాస్ ఐసోలేష‌న్ గ‌దిలోకి వెళ్లి కుమారుడు ఖాసియ్ ముఖాన్ని దిండుతో అదిపి ఊపిరి ఆడ‌కుండా చేసి చంపేశాడు. అనంత‌రం డాక్ట‌ర్లు పిలిచాడు. వైద్యులు ఆ బాలుడిని ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందించేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేయారు. అయినా లాభం లేక‌పోయింది. క‌రోనాతో కొడుకు చ‌నిపోయాడ‌ని చెప్పి అత‌డి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశాడు. క‌రోనా నెగిటివ్ వ‌చ్చినప్ప‌టికి ఖాసియ్ మృతి పై పెద్ద‌గా ఎవ‌రికి అనుమానాలు రాలేదు.

చేసిన పాపం ఊరికే పోదుగా.. 11 రోజుల త‌రువాత చేసిన త‌ప్పుకు ప‌శ్చాత్తాప ప‌డిన ఈ పుట్‌బాల్ ఆట‌గాడు పోలీసుల వ‌ద్ద‌కి వెళ్లి లొంగిపోయాడు. త‌న కుమారుడు ఖాసియ్ అంటే త‌న‌కు ఇష్టం ఉండేది కాద‌ని, ఈ కార‌ణంతోనే వాడి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడ‌కుండా చేసి చంపేశాన‌ని పోలీసుల‌కు చెప్పాడు. త‌న‌కు ఎలాంటి మాన‌సిక స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని ఈ కేసు విచారణ ప్రారంభించారు.

Next Story