వార్న‌ర్, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ధావ‌న్ కౌంట‌ర్ ఇచ్చాడా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 8:44 AM GMT
వార్న‌ర్, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ధావ‌న్ కౌంట‌ర్ ఇచ్చాడా..!

భార‌త్ జ‌ట్టు ఓపెన‌ర్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ లు చేసిన కామెంట్లపై టీమ్ఇండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ స్పందించాడు. తాజాగా భార‌త ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు గ‌బ్బ‌ర్‌.

త‌న‌కు ఓపెనింగ్ కొత్త‌కాదు అని, భార‌త జ‌ట్టు త‌రుపున ఎనిదేళ్లుగా ఓపెనింగ్ చేస్తున్నాన‌ని ధావ‌న్ చెప్పుకొచ్చాడు. తాను తొలి బంతి, తొలి ఓవ‌ర్ ఆడ‌టానికి ఇష్ట‌ప‌డ‌న‌ని కొంద‌రు అన్నారు. ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తొలి ఓవ‌ర్ ఆడ‌క‌పోయిన రెండో ఓవ‌ర్ అయినా ఆడాలి క‌దా.. పేస్ బౌల‌ర్ల‌ను ఆడ‌క‌లేక‌పోతే ఇక ఓపెనింగ్‌కు దిగ‌డం ఎందుకు అని వ్యాఖ్యానించాడు.

‘ ఓపెనింగ్‌ కొత్త కాదు.. దాదాపు ఎనిమిదేళ్లుగా మూడు ఫార్మాట్ల‌లో ఓపెనింగ్‌ చేస్తున్నా. నేను ఏదో తొలి బంతిని ఆడటాన్ని, మొదటి ఓవర్‌ను ఆడటాన్ని ఇష్టపడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకవేళ మనకు సీమింగ్‌ వికెట్‌ ఎదురైతే కాస్త కఠినంగా ఉంటుంది. ఒకవేళ తొలి ఓవర్‌ను ఆడకపోతే, రెండో ఓవర్‌నైనా ఆడాలి కదా.. పేస్‌ బౌలర్లను ఆడకపోతే ఇక ఓపెనింగ్‌కు దిగడం ఎందుకు. నేను ఓపెనర్‌ అయినప్పుడు తొలి ఓవర్‌ను ఎందుకు ఆడలేను’ అని ధావన్ అన్నాడు.

ఇక కామెంటేట‌ర్లు త‌న పై చేసే వ్యాఖ్య‌ల‌ను అస‌లు ప‌ట్టించుకోన‌న్నాడు. మ‌నం సెంచ‌రీలు చేసిన పొడిగే వాళ్లే.. మ‌నం డ‌కౌట్ అయితే విమ‌ర్శిస్తారు. ఎందుకంటే అది వారి డ్యూటీ. ఒక వేళ నేను కామెంటేట‌ర్‌ను అయితే.. నేను కూడా అదే ప‌ని చేస్తాన‌ని అన్నాడు. ఇక వీరిద్ద‌రి లైవ్ చాట్‌లో రెండు మూడు సార్లు ధావ‌న్ నెట్ ఇబ్బంది పెట్టింది. దీనిపై ధావ‌న్ త‌న‌దైన శైలిలో కామెంట్ చేశాడు. జ‌ట్టుకు దూర‌మ‌వ్వ‌డం మ‌ళ్లీ రీ ఎంట్రీలు ఇవ్వ‌డం త‌న‌కు కొత్త‌కాద‌న్నాడు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ధావ‌న్ కు తిరుగు లేన‌ప్ప‌టికి సుధీర్ఘ పార్మాట్‌లో మాత్రం రోహిత్‌, మ‌యాంక్‌, పృధ్వీ షాల నుంచి గ‌ట్టి పోటి ఎదుర్కొంటున్నాడు.

ఇటీవ‌ల హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వార్న‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు రోహిత్ స‌మాధాన‌మిస్తూ.. ‘ధావన్‌ ఒక ఇడియట్ అని, తొలి బంతిని ఫేస్‌ చేయడానికి ఇష్టపడేవాడు కాద‌న్నాడు. 2013లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను షేర్ చేసుకున్నాడు. దీనిపై వార్న‌ర్ మాట్లాడుతూ.. ధావ‌న్ తో ఈ ఇబ్బందుల‌ను తాను కూడా ఎదుర్కొన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

Next Story