శ్రీవారి సన్నిధిలో దారుణం.. టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Feb 2020 12:37 PM GMT
శ్రీవారి సన్నిధిలో దారుణం.. టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య

టీటీడీ అధికారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. రెండవ సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఉమా శంకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలు కలిగిస్తోంది. సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆయన ఆత్మహత్యకు పాల్పడేందుకు వెనుక తిరుమలలోని ఓ ఉన్నతాధికారి వేధింపులే కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమాశంకర్ రెడ్డి.. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లుగా తెలుస్తోంది. మూడు నెలల క్రితం వరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన ఉమాశంకర్ రెడ్డి నిజాయితీగా వ్యవహరిస్తూ, ముక్కుసూటిగా మాట్లాడేవారు అని తెలుస్తోంది.

సుపధం దర్శనం టికెట్ల మంజూరు విషయంలో శంకర్ రెడ్డి కి తిరుమలలోని ఓ టీటీడీ ఉన్నతాధికారి అందరి ముందే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఉమాశంకర్ రెడ్డి.. తాను నిజాయితీ వ్యవహరిస్తున్నారని, ఎవరికీ భయపడనని, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి.. అంటూ బహిరంగంగా ఉన్నతాధికారికి ఎదురు తిరిగి సమాధానం ఇచ్చారని, దీంతో ఉన్నతాధికారి చైర్మన్ కార్యాలయం నుండి బదిలీ వేటు వేశారని టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గతంలో ఆర్జితం కార్యాలయం, మార్కెటింగ్ విభాగం, బోర్డు సెల్, చైర్మన్ క్యాంప్ ఆఫీస్, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉమాశంకర్ రెడ్డి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడడం టీటీడీ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలోనూ తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న సురేష్.. అనే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విష‌య‌మై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీసి ఆత్మహత్యకు కారణమైన వారు.. ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story