ఉద్యోగం పోయిందన్న ఆందోళనలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: బంగారు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మొన్న ఖమ్మం ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య మరువకముందే హైదరాబాద్‌లో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుపోగా.. ఉన్న ఉద్యోగాలను తీసివేయడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న సురేందర్ గౌడ్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
14 ఏళ్లుగా ఆర్టీసీలో కార్మికునిగా పని చేస్తున్న సురేందర్ గౌడ్ ఇటీవలే ప్రైవేట్ బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇంటి లోన్ ఎలా కట్టాలో తెలియక సురేందర్ గౌడ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కార్వాన్‌లో నివాసం ఉంటున్న సురేందర్ గౌడ్.. తొటి కార్మికులతో కలసి ప్రతిరోజు రాణిగంజ్ డిపో వద్ద సమ్మెలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తనకు జీతం రాదనుకున్న సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకున్నాడు. సురేందర్‌ను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సురేందర్ గౌడ్ చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు సురేందర్ గౌడ్ ఇంటికి చేరుకున్నారు.
�
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/bjp-cpi-sfi-support-to-rtc-workers/
�
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/jana-sena-support-for-rtc-workers-strike/
�
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/intermittent-rtc-drivers/
�
�