టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎప్ప‌టినుండంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2020 7:51 AM GMT
టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎప్ప‌టినుండంటే..

లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ టెన్త్ క్లాస్ పరీక్షలకు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన హైకోర్టు.. జూన్ 8 నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చ‌ని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉన్నామ‌ని హైకోర్టుకు అఫిడవిట్ దాఖ‌లు చేసింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు విచారణ జ‌ర‌గింది.

పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపడంతో.. జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుద్వాన్ని హైకోర్టు అదేశించింది. అనంత‌రం జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కోరింది. ఆపై జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్ర‌భుత్వానికి సూచించింది.

అయితే.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలన్న ప్ర‌భుత్వానికి సూచించిన హైకోర్టు.. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కోర‌కు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో అన్ని చర్యలు చేపడుతామని ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది.

Next Story