టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఖరారు
By తోట వంశీ కుమార్ Published on 7 Sep 2020 12:40 PM GMTటీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 9 న పాలిసెట్ ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 12 నుంచి 17వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 22న సీట్ల కేటాయింపు జరగనుంది.
ఇక సీట్లు సొందిన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ప్ రిపోర్ట్ చేయాలి. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 30వ తేదీన, అక్టోబర్ 1న వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అక్టోబర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తారు. అక్టోబర్ 7 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.