ఇప్పటి వరకు తెలంగాణ మున్సిపల్‌ ఫలితాలు ఎవరికి ఎన్ని..!

By సుభాష్  Published on  25 Jan 2020 6:32 AM GMT
ఇప్పటి వరకు తెలంగాణ మున్సిపల్‌ ఫలితాలు ఎవరికి ఎన్ని..!

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలను ఎలా వచ్చాయనేది పరిశీలిస్తే.. మొత్తం 2979 వార్డులకు గానూ, టీఆర్‌ఎస్‌ 818, కాంగ్రెస్‌ 228, బీజేపీ 108, ఎంఐఎం 19, ఇతరులు 134 స్థానాల్లో విజయం సాధించారు. మరో 1418 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.

ఈనెల 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కాగా, ఇప్పటికే అధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2619 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 27న మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నిక జరగనుంది.

Next Story