తెలంగాణ మున్సిపల్‌ ఫలితాల అప్‌డేట్స్‌

By సుభాష్  Published on  25 Jan 2020 4:16 AM GMT
తెలంగాణ మున్సిపల్‌ ఫలితాల అప్‌డేట్స్‌

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్లలెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం వరకు 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెలవడనున్నాయని ఎస్‌ఈసీ నాగిరెడ్డి తెలిపారు.

టీఆర్‌ఎస్‌ నుంచి 2,925 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా, కాంగ్రెస్‌ నుంచి 2,619, బీజేపీ నుంచి 2,321 మంది అభ్యర్థులున్నారు. ఇక టీడీపీ తరపున 347 మంది, ఏఐఎంఐఎం నుంచి 297 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సీపీఐ నుంచి180, సీపీఎం 165, ఇతర పార్టీల వారు 284, స్వతంత్రులు 3,760 మంది పోటీ పడుతున్నారు. ఇక 9 కార్పొరేషన్‌లలో 325 వార్డులుండగా, వీటిలో ఒక ఏకగ్రీవమైంది. 120 మున్సిపాలిటీల్లో 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. పరకాలలో 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

మహబూబ్‌నగర్‌లోని 17వ వార్డులో డోర్నకల్‌లో 5వ వార్డు, మరిపెడలో 8,9 వార్డులు, 12,13 వార్డులు భూపాలపల్లి 9వ వార్డు, హూజూరాబాద్‌ల ఓ2,28 వార్డులు, పెద్దపల్లిలో 2వార్డులు, సత్తుపల్లిలో 6 వార్డులు, వైరాలో ఒక వార్డు, నిర్మల్‌లో 10,13 వార్డులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

అప్‌డేట్స్‌:

  • వర్ధన్నపేటలో నాలుగు వార్డుల్లో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, ఒకటో వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థు గెలుపొందారు. ఇక డోర్నకల్‌లోని మూడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • ఆదిభట్ల ఐదో వార్డులో , సంగారెడ్డి జిల్లా బొల్లారం 17, 18 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు.
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మొత్తం 12 వార్డుల్లో ఇప్పటి వరకు నాలుగింటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • జగిత్యాల జిల్లాలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. 48వార్డులకుగాను 1వ వార్డు నుంచి మాలతి, 8వ వార్డులో వొడ్నాల ఉమాలక్ష్మీలు విజయం సాధించారు.
  • ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడుముల లింగం గెలుపొందారు.
  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా, 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
  • సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్‌ పరిధిలో మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్‌లో 15వార్డుల్లో 1,2 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు, 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు.
  • నిర్మల్‌ జిల్లా భైంసాలో 26 వార్డులకు పోలింగ్‌ జరుగగా, 4 చోట్ల ఎంఐఎం విజయం సాధించింది.
  • వరంగల్‌ రూరల్‌ మున్సిపల్‌లో 17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోపి, 12వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాణి గెలుపొందారు.
  • పరకాల మున్సిపల్‌లో 20వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌. అనిల్‌ రామకృష్ణ, 10వ వార్డులో లావణ్య గెలుపొందారు.
  • సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డుల్లో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ఒక స్థానం సాధించింది.
  • సిరిసిల్లాలోని నాలుగు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. వేములవాడ మున్సిపల్‌లో ఒక స్థానం టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.
  • మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆలగిరి చిత్ర డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు.
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్‌లో 1,2, 3 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 1వ వార్డులో తాస్లిం పిర్‌దోస్‌, 2వ వార్డులోకాంగ్రెస్‌ అభ్యర్థి రాములుపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మోతీలాల్‌ 267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి పహీంపై, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నేహాసుల్తానపై 350 ఓట్లతో గెలుపొందారు.
  • వరంగల్‌ జిల్లాలో వర్ధన్నపేట మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 8వ వార్డులో టీఆర్‌ఎస్‌, మరో రెండు వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఒక బీజేపీ, ఒక స్వతంత్ర్య అభ్యర్థి గెలుపొందారు.
  • కామారెడ్డి లో ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 4, స్వతంత్ర 4 చొప్పులు గెలుపొందారు.
  • నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలలో 15 వార్డుల్లో 8 కాంగ్రెస్‌, 7 టీఆర్‌ఎస్‌ గెలుపొందాయి.
  • నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 12 వార్డుల్లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా, 11 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజుపై, కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌ 148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • చిట్యాల మున్సిపాలిటీలో 7, 10 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • ధర్మపురిలో మొత్తం 15వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 7 గెలుపొందాయి.
  • సత్తుపల్లి 10వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు.
  • రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో 9వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మండపతి చంద్రమౌలి గెలుపొందారు.
  • కరీంనగర్‌ జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ చేసుకుంది. ఇప్పటికే భీంగల్‌ మున్సిపాలిటీలో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌.. తాజాగా కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ, 11 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం ఒక్క స్థానం మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది.
  • పెద్దపల్లి జిల్లా రామగుండం పురపాలకలో టీఆర్‌ఎస్‌ ముందంజలోఉంది.7,30,33,15,4,5 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. 29 డివిజన్లలో సీపీఐ, 26 డివిజన్లలో బీజేపీ, 29వ డివిజన్‌లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్‌లో కారు జోరందుకుంది. ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ వశపర్చుకోగా, వైరాలో 20 మున్సిపాలిటీలుండగా, ఇప్పటికే 7 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ 10, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. ఇల్లెందులో 24 వార్డులుండగా టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది.
  • నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపాలిటీలో ఐదు వార్డులను టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా, కాంగ్రెస్‌ మూడు, బీజేపీ ఒకటి, ఎంఐఎం ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

Ts Minicipal Result

ఇప్పటి వరకు 619 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది.

టీఆఎస్‌ఎస్‌ - 619

కాంగ్రెస్‌ - 166

బీజేపీ - 74

ఎంఐఎం - 14

ఇతరులు - 78 చోట్ల విజయం సాధించారు.

నల్గొండలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ హవా

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. నల్గొండలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ మధ్య పోటీ కొనసాగుతోంది. నల్గొండ మున్సిపల్‌ పరిధిలో మొత్తం 48 వార్డుల్లోనూ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ 8 స్థానాలు కైవసం చేసుకోగా, ఆరు చోట్ల కాంగ్రెస్‌, ఇక బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానం దక్కించుకున్నారు. దేవరకొండ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానం దక్కించుకున్నారు. ఇక నందికొండ మున్సిపల్‌లో వెలువడిన నాలుగు ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 1 విజయం సాధించాయి.

మున్సిపల్‌లో కారు జోరు

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ వశపర్చుకుంది. ఇక మెజార్టీలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కారు స్పీడు ఏ మాత్రం తగ్గడం లేదు. 80కిపైగా మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

నాగర్‌కర్నూలులో టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి

నాగల్‌కర్నూలులో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాత్రం కారుకు కాస్త బ్రేకులు పడ్డాయి. నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం గట్టి పోటీనే ఇస్తోంది. కొల్లాపూర్‌లో కూడా టీఆర్‌ఎస్‌కు స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.

కొడంగల్‌ లో కారు కైవసం

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడుకు అంతే లేకుండా పోతోంది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మున్సిపాలిటీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో ఇప్పటి వరకు 8 స్థానాలు టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలేవి ఇక్కడ విజయం సాధించకపోవడం విశేషం.

అమరచింతలో స్వతంత్రులదే హవా..

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థులదే హవా కొనసాగుతోంది. మొత్తం పది స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ మూడు, బీజేపీ, కాంగ్రెస్‌ చెరో స్థానాలు దక్కించుకున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కారు జోరు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తిరుగు లేకుండా పోతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు నాలుగు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. భీంగల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీజెండా ఎగురవేసింది. అలాగే మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భీంగల్‌లో 12 వార్డులకు 12 వార్డులను టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ హవా..

ఇక స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మొత్తం 19 వార్డుల్లో 15వార్డులు టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పైచేయి నిలిచింది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ..

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 18 వార్డుల్లో 7 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీం కాగా, ఎన్నికలు జరిగిన మిగితా స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులకు గానూ, టీఆర్‌ఎస్‌ 22 స్థానాలు దక్కించుకుంది. ఇక బెల్లంపల్లిలో 34 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ 25, స్వతంత్రులు 6, కాంగ్రెస్‌ 2 చొప్పున గెలుపొందారు. భైంసాలో 26 వార్డులుండగా, ఎంఐఎం 6, బీజేపీ 6, స్వతంత్రులు 2 స్థానాల చొప్పున గెలుపొందారు. మరో వైపు నిర్మల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఖానపూర్లో 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 2, బీజేపీ ఒక స్థానం కైవసం చేసుకుంది.

ఇబ్రాహింపట్నంలో టీఆర్‌ఎస్‌

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16, కాంగ్రెస్‌ 6, బీజేపీ రెండు స్థానాలు దక్కించుకున్నాయి.

2990 వార్డులలో టీఆర్‌ఎస్‌ కైవసం

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కడుతున్నారు. 1:15 గంటల వరకు వెలువడిన ఫలితాలు చూస్తే మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2990 వార్డులలో టీఆర్‌ఎస్‌ 1238, కాంగ్రెస్‌ 386, బీజేపీ 175, ఎంఐఎం 42, ఇతరులు 250 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇంకా 627 వార్డుల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ఇబ్రాహింపట్నంలో టీఆర్‌ఎస్‌

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16, కాంగ్రెస్‌ 6, బీజేపీ రెండు స్థానాలు దక్కించుకున్నాయి.

నర్సంపేటలో టీఆర్‌ఎస్‌దే విజయం

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మొత్తం 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 16, కాంగ్రెస్‌ 6, ఇతరులు 2 చొప్పున విజయం సాధించారు.

టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించింది

Harish Rao

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రసిడెంట్‌ కేటీఆర్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, కార్యకర్తలకు హరీష్‌రావు అభినందనలు తెలిపారు.

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ విజయం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 40 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 22, కాంగ్రెస్‌ 2, బీజేపీ 3, ఇతరులు 12 స్థానాల్లో గెలుపొందారు.

Next Story