రాజ్ భవన్ లోనూ జనతా కర్ఫ్యూ : గవర్నర్
By రాణి
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ యాక్టర్లు, క్రికెట్ స్టార్లు కూడా స్పందించి తమ కుటుంబంతో సహా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు ప్రకటించారు. అలాగే మిగతా వారంతా కూడా ఇదే పద్ధతిని పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని సూచించారు.
Also Read : బాలీవుడ్ సింగర్ కు కరోనా..సెల్ఫ్ క్వారంటైన్ లో మాజీ ముఖ్యమంత్రి
తెలుగు రాష్ర్టాల్లో సైతం కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రానికి 223కు చేరగా..ఏపీ, తెలంగాణ కలిపి 21 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ..రాజ్ భవన్ లో కూడా జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజ్ భవన్ లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ‘కరోనా’ వ్యాపించిందని, తెలంగాణలో ఎవరికి ఈ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్య పరిచేందుకు ‘కరోనా’పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Also Read : ధరలు పెంచితే కఠిన చర్యలు : వ్యాపారులకు జగన్ హెచ్చరిక