యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు బాలీవుడ్ కు సోకింది. బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ కు కరోనా సోకినట్లు నిర్థారణయింది. ఈ విషయాన్ని కనికా కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవలే లండన్ వెళ్లిన కనికా ఈనెల 15వ తేదీన లక్నోకు చేరుకున్నారు. కరోనా వైరస్ సోకిందని మాత్రమే కనికా చెప్పారు కానీ..ఈ మధ్యలో తాను ఎవరెవర్ని కలిసిందీ..ఎక్కడెక్కడ తిరిగిన విషయాల గురించి ఇంకా అధికారులకు తెలుపలేదని సమాచారం.

Also Read : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్

రెండ్రోజుల క్రితమే కనికా కపూర్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించిన విందులో పాల్గొన్నారు. ఈ విందుకు ఎంపీ దుశ్యంతసింగ్, అతని తల్లి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే లతో పాటు 500 మంది హాజరైనట్లు వసుంధర స్వయంగా ట్వీట్ చేశారు. కనికా కపూర్ కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో..తాను కూడా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అవుతున్నట్లు తెలిపారు.

Also Read : ధరలు పెంచితే కఠిన చర్యలు : వ్యాపారులకు జగన్ హెచ్చరిక

కాగా..కనికా కపూర్ కు కరోనా వైరస్ ఉందని తెలియక అదే పార్టీలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఒకరు నిన్న రాజ్యసభ అంతా కలియతిరిగారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ ఎంపీలతో భయంతో వణికిపోతున్నారు. అలాగే కనికా కపూర్ వెళ్లిన పార్టీకే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. సింగర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే వెంటనే తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు.రాణి యార్లగడ్డ

Next Story