ధరలు పెంచితే కఠిన చర్యలు : వ్యాపారులకు జగన్ హెచ్చరిక

By రాణి  Published on  20 March 2020 12:39 PM GMT
ధరలు పెంచితే కఠిన చర్యలు : వ్యాపారులకు జగన్ హెచ్చరిక

కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలు కూడా దాదాపు అన్ని సంస్థలను మూసివేశాయి అక్కడక్కడా నిత్యావసరాల దుకాణాలు తప్ప. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన పెంచి, అపోహలను తొలగిపోయేలా చేయాలని జగన్ ఆదేశించారు.

Also Read : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్

అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. వైరస్ సాకుతో ఎవరైనా నిత్యావసరాల ధరలను పెంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని జగన్ సూచించారు. బస్సుల్లో శుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో యాంటీ బయాటిక్స్, పారాసిటమాల్ లను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

Also Read : నువ్వు అలా ఎలా వస్తావ్ అంటూ రష్మీపై ఫైర్ అయిన నెటిజన్లు

Next Story