రెండు వారాలుగా భారీ నష్టాలను చవిచూస్తోన్న స్టాక్ మార్కెట్లకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం సాయంత్రం భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో మదుపరులు కాస్త ఊరట చెందారు. సెన్సెక్స్ 1627.73 పాయింట్లు లాభపడి 29,195 వద్ద ముగియగా, నిఫ్టీ 482 పాయింట్లు లాభపడి 8,745.45 వద్ద ఆగింది. స్టాక్ మార్కెట్లకు లాభాలు రావడంతో.. డాలరుతో పతనమైన రూపాయి విలువ 75.04వద్ద కొనసాగుతోంది. లాభాలతో మదుపరుల ఆదాయం రూ.5 లక్షల కోట్లకు పైగానే పెరిగింది. నిఫ్టీలో భారతీ ఇన్ ఫ్రాటెక్, ఓఎన్ జీసీ, గెయిల్, అల్ర్టాటెక్ సిమెంట్, హెచ్ యూఎల్ షేర్లు లాభాల బాటలో పయనించాయి.

Also Read : నువ్వు అలా ఎలా వస్తావ్ అంటూ రష్మీపై ఫైర్ అయిన నెటిజన్లు

యెస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ , అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ లకు సంబంధించిన షేర్లు మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. అయితే..వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగియడం ఇది కొత్తేం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అమెరికాలో కూడా నాలుగుసార్లు భారీగా పతనమైన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్..తర్వాత ఉన్నట్లుండి పుంజుకున్నాయి.

Also Read : భారత్ లో 206 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ

రాణి యార్లగడ్డ

Next Story