తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు..

By అంజి  Published on  6 April 2020 2:17 AM GMT
తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 334కు చేరింది. ఆదివారం నాడు కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకు 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జి కాగా.. మరో 11 మంది మృత్యువాత పడ్డారు.

290 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 52 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో హైదరాబాద్‌లో కరోనా బాధితుల సంఖ్య 156కు చేరింది.

Also Read: అనుకున్న దానికన్నా భారీగా తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యులకే ఎక్కువగా కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షల కోసం రాష్ట్రంలోని ఆరు ల్యాబ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.

గడిచిన మూడు రోజుల నుంచి వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంటున్న మర్కజ్‌ వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యుల్లో, సన్నిహితుల్లో వైరస్‌ లేదని నిర్దారణ అయిన తర్వాత ఇళ్లకు పంపుతున్నారు.

Also Read: సామూహిక విందు.. 26 వేల మంది క్వారంటైన్‌

బాలపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్‌ నిర్దారణ అయ్యింది. హఫీజ్‌పేటలో ఒకరికి కరనా నిర్దారణ అయ్యింది.

Next Story
Share it