తెలంగాణ‌లో కొత్త‌గా 117 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 8:59 PM IST
తెలంగాణ‌లో కొత్త‌గా 117 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. గురువారం రాత్రి 8.30 గంటలకు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి. అందులో తెలంగాణ నుంచి 66 కేసులు కాగా, ఇద్దరు వలస వచ్చిన వారు, మరో 49 మంది సౌదీ ఆరేబియా నుంచి వచ్చిన వారు గా గుర్తించారు. కాగా, లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో పాజిటివ్‌‌ కేసులు 2,256 చేరగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 348 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, రాష్ట్రంలో మరో న‌లుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 67కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారిసంఖ్య 1345 చేరగా, 844 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు:

తెలంగాణలో కొత్త కేసులు : 66

వలస వచ్చిన వారు : 02

సౌదీ నుంచి వచ్చినవారు : 49 మంది ఉన్నారు.

తెలంగాణలో మొత్తం కేసులు: 2,256

వలస వచ్చిన వారు : 175

సౌదీ నుంచి వచ్చిన వారు : 143

విదేశాల నుంచి వచ్చిన వారు : 30 మంది పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉన్నారు.

కాగా, మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. . కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.

Next Story