నల్లగొండ జిల్లాలో చిక్కిన చిరుత మృతి
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 2:54 PM GMTనల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో గురువారం ఉదయం చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఉదయం నుంచి రైతులను, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతను ఫారెస్టు సిబ్బంది పట్టుకున్న సంగతి తెలిసిందే. చిరుతను పట్టుకునే క్రమంలో ఇద్దరు ఫారెస్టు అధికారులకు గాయాలయ్యాయి. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.
ఈ చిరుతను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. చిరుతకు హైదరాబాద్‌లో పోస్టు మార్టం నిర్వహించారు. కంచెలో ఇరుక్కుని గాయాలు అవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరగడం, ఎండల కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అధికారులకు చిక్కిన ఈ చిరుత వయసు 7 సంవత్సరాలు.
Also Read
చిరుతను పట్టేశారు..Next Story