కరోనా వేళ: మంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  26 March 2020 3:23 AM GMT
కరోనా వేళ: మంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటిల సంఖ్య 41 చేరింది. ప్రస్తుతం తెలంగాణాలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున మంత్రి కేటీఆఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ముందుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను సైతం మూసివేయాలని అనుకున్నారు. కానీ పేదలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పేదల ఆకలిని తీర్చేందుకు రూ.5 భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.

అంతేకాదు లాక్‌డౌన్‌ ప్రభావం ఉన్న కేంద్రాల్లో ఉన్నవాళ్లు ఇప్పుడు ఆ కేంద్రాల్లో ఉచితంగానే భోజనం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద ఇకపై పేదలకు ఉచితంగానే భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా రోజూవారి కూలీలు సహా మరెవ్వరూ కూడా ఆకలితో ఉండిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్‌ తెలిపారు. అంతేకాకుండా హస్టళ్లలోనే ఉండిపోయిన వారు, ఇతరులకు కూడా జీహెచ్‌ఎంసీ తరపున ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

Next Story