ట్రంప్ ట్వీట్ ను బ్లాక్ చేసిన ట్విట్టర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 3:59 PM GMT
ట్రంప్ ట్వీట్ ను బ్లాక్ చేసిన ట్విట్టర్

ట్రంప్ ట్వీట్ పై ట్విట్టర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండ్రోజుల క్రితమే ట్రంప్ కు, ట్విట్టర్ కు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్నపాటి వార్ జరిగింది. ఆ వార్ లో 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ అనవసరంగా జోక్యం చేసుకుంటుందన్నట్లుగా కూడా ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు ఓ గవర్నర్ గురించి ట్రంప్ చేసిన ట్వీట్ పై ట్విట్టర్ స్పందిస్తూ ట్రంప్ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిందిగా వార్నింగ్ పంపింది.

తాజాగా మరోసారి ట్రంప్ ట్విట్టర్ ఆగ్రహానికి గురయ్యారు. ట్రంప్ చేసిన ఓ ట్వీట్ ను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ ట్వీట్ చాలా అసభ్యకరంగా ఉందని పేర్కొన్న ట్విట్టర్ దానిని బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ చేసిన ఆ ట్వీట్ ఇలా ఉంది.ట్రంప్ ధోరణి ఇలాగే కొనసాగితే ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండోసారి ట్విట్టర్ తీసుకున్న చర్యలతో ఇకనైనా ట్రంప్ ట్వీట్లు చేసే పద్ధతిలో ఏమైనా మార్పు వస్తుందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లేదు తానింతే..ఇక మారనంటే మాత్రం మరోసారి అగ్రరాజ్యం నుంచి పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ట్రంప్ కు లేనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Next Story