కరోనా కేసులు తగ్గాలంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 10:10 AM GMT
కరోనా కేసులు తగ్గాలంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ ప్రచారం ప్రారంభించారు. ఓక్లమాహాలోని టల్సాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కరోనా పై ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా పరీక్షలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. నిర్ధారణ పరీక్షలు అన్నవి కత్తికి రెండు వైపులా పదును లాంటివి. ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కరోనా కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పాను అని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు అక్కడకు వచ్చిన ట్రంప్ మద్దతుదారులందరూ కేరింతలు కొట్టారు. అయితే ఈ మాటలు ఆయన సరదాగా చేసినవా..? లేక నిజంగానే పరీక్షలు తగ్గించమని అధికారులు జారీ చేశారా..? అన్నది తెలీదు. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ 23లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోద అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి 1.2లక్షల మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసులు 9.7లక్షల మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 12లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 89లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4.6లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story
Share it