దేశంలో కరోనా విజృంభణ.. 4లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 4:34 AM GMT
దేశంలో కరోనా విజృంభణ.. 4లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

భారత్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో శరవేగంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా రోజుకు పది వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంట్లలో 15,143 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 306 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసలు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,10,461కి చేరగా.. మృతుల సంఖ్య 13,254కి చేరింది.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,27,756 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,69,451 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 8వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 89లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి 4.6లక్షల మంది మృత్యువాత పడ్డారు.

Next Story