ప‌దేళ్ల‌ తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్‌.. ఎందుకంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2020 8:46 AM GMT
ప‌దేళ్ల‌ తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్‌.. ఎందుకంటే..

అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ.. ఓ ప‌దేళ్ల బాలిక అందించిన సేవ‌ల‌కు గానూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆమెను స‌త్క‌రించారు. వివ‌రాళ్లోకెళితే.. గర్ల్స్‌ స్కౌట్‌ సభ్యురాలు, తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డి (10) అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపడంతో పాటు.. తాను సేవ‌లందించింది. అంతేకాదు.. ఇటీవల అమెరికాలోని వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ ఆమె వ్యక్తిగత కార్డులను పంపింది.

శ్రావ్య అన్నపరెడ్డి సభ్యురాలుగా ఉన్న గర్ల్స్‌ స్కౌట్ గ్రూపు‌ మేరీల్యాండ్,‌ ఎల్క్‌రిడ్జ్‌లోని‌ ట్రూప్ 744లో సేవలు అందిస్తున్నారు. కాగా.. వారు ఇటీవల 100 బాక్స్‌ల గర్ల్స్‌ స్కౌట్స్‌‌ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి పంపారు. దీంతో వారిని శ్వేతసౌధంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రావ్యతో పాటు లైలా ఖాన్‌, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా ట్రంప్‌ సత్కరించారు.

ఇదిలావుంటే.. నాలుగో తరగతి‌ చదువుతున్న ‌శ్రావ్య.. తన తల్లిదండ్రులతో హ‌నోవ‌ర్‌లో ఉంటుంది. చిన్న‌ప్ప‌టి నుండే త‌న తల్లిదండ్రులు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది. శ్రావ్య తండ్రి విజయ్‌రెడ్డి అన్నపరెడ్డి ఫార్మాసిస్ట్. శ్రావ్య తండ్రి స్వ‌స్థ‌లం ఏపీలోని గుంటూరు కాగా.. తల్లిది ప్ర‌కాశం జిల్లా బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం.

Next Story