గన్‌మెన్ల టిక్‌టాక్.. భద్రత గాలికి..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 17 Oct 2019 11:01 AM IST

వరంగల్: ఓ ఎంపీ గన్‌మెన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. భద్రత కల్పించాల్సిన పని మానేసి టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేశారు. ఓ యువకుడు బాషా రేంజ్‌లో బిల్డప్ ఇస్తే.. గన్‌మెన్లు వెనుక నిలబడి షో చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ రెండు రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద గన్‌మెన్లు బండ ప్రకాష్ అల్లుడితో కలిసి టిక్‌టాక్‌ల్లో మునిగి తేలడం కలకలం రేపుతోంది. బండ ప్రకాష్ అల్లుడు జగన్‌కు గన్‌మెన్లుగా యాక్షన్ చేస్తూ వీడియోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ వీడియోలకు జగన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో భద్రతను గాలికి వదిలేసిన గన్‌మెన్లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Next Story