కొద్దిరోజుల పాటూ వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా: త్రిష

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 6:22 AM GMT
కొద్దిరోజుల పాటూ వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా: త్రిష

తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఈ మధ్య తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఏ సినిమాలో అయినా నటిస్తోంది. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించబోయే పొన్నియన్ సెల్వన్, రాంగి, షుగర్ అండ్ రామ్ సినిమాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ సమయంలోనే శింబు, త్రిష కలిసి విన్నై తాండి వరువాయా సీక్వెల్ గా రూపొందించిన షార్ట్ ఫిలింలో నటించింది త్రిష. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ సమయాన్ని స్పెండ్ చేస్తోంది. టిక్ టాక్ వీడియోల ద్వారా అభిమానులను అలరిస్తోంది.

ప్రస్తుతం త్రిష తానొక నిర్ణయం తీసుకున్నట్లు అభిమానులకు తెలిపింది. కొద్దిరోజుల పాటూ సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని.. ట్వీట్ చేసింది. ప్రస్తుత పరిస్థితులలో నా చుట్టూ ఏం జరుగుతోందన్నది నాకు తెలియకుండా వుండడమే మంచిదనిపిస్తోంది. కొద్దిరోజుల పాటూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ కలుద్దాం. సమయం అన్నది ఈజీగా గడిచిపోతుంది. ఇళ్ళల్లోనే వుండండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు సూచించింది త్రిష. తన అభిమానుల పట్ల ప్రేమను కూడా చూపించింది. తాను త్వరలోనే సోషల్ మీడియాలోకి తిరిగి వస్తాను అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల విషయంలోనే త్రిష సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి చాలా మంది స్టార్స్ సోషల్ మీడియాకు దూరమయ్యి తిరిగివచ్చారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత కొద్దిరోజుల పాటూ సోషల్ మీడియాకు దూరంగా ఉండి.. తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందు సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయింది. అలా కొందరు సెలెబ్రిటీలు డిజిటల్ ప్లాట్ ఫామ్ ల నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు దూరమైపోతున్నారు. తర్వాత తిరిగి సోషల్ మీడియాలోకి వస్తున్నారు.

Next Story