ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త : జూన్‌ 1 నుంచి ప‌ట్టాల‌పైకి రైళ్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 1:58 AM GMT
ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త : జూన్‌ 1 నుంచి ప‌ట్టాల‌పైకి రైళ్లు

డిల్లీ: ప‌్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ శుభ‌వార్త చెప్పింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు తిరిగి ప‌ట్టాలెక్క‌నున్నాయి. ఈ మేరకు జూన్‌ 1 నుంచి రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన టైం టేబుల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.



అయితే.. ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని.. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వలస కార్మికుల కోసం నడిపే 200 శ్రామిక్‌ రైళ్లతోపాటు అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం కానుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Next Story