రైళ్లు రద్దు.. దారి మళ్లింపు.. గమనించాల్సిన తేదీలు ఇవే.!

By అంజి  Published on  25 Feb 2020 4:34 AM GMT
రైళ్లు రద్దు.. దారి మళ్లింపు.. గమనించాల్సిన తేదీలు ఇవే.!

హైదరాబాద్‌: సెంట్రల్‌ రైల్వే పరిధిలో జరుగుతున్న పలు ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా సంబంధిత సాంకేతిక పనుల కారణాల వల్ల బెంగళూరు డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నిటిని దారి మళ్లీంచారు.

ఈ నెల 24న హౌరాలో బయల్దేరిన హౌరా-యశ్వంత్‌పూర్‌ 22863 ఎక్స్‌ప్రెస్‌ వయా కృష్ణరాజపురం, చన్నసంద్ర, ఎల్లహకం మీదుగా నడుస్తుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 25న యశ్వంత్‌పూర్‌లో బయల్దేరే యశ్వంత్‌పూర్‌ -హౌరా 12246 దురంతో ఎక్స్‌ప్రెస్‌ వయా ఎల్లహంక, చన్నసంద్ర, కృష్ణరాజపురం మీదుగా నడవనుంది. మార్చి 6న పూరీలో బయల్దేరే పూరీ-యశ్వంత్‌పూర్‌ 22883 ఎక్స్‌ప్రెస్‌ వయా నంద్యాల, యర్లగంట్ల, రేణిగుంట, మెల్‌పక్కం, జాలర్‌పేటల మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

మరోవైపు సంబల్‌పూర్‌-బాన్స్‌వాడి 08301 స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు కృష్ణరాజపురం వరకే నడవనుంది. తిరుగుప్రయాణంలో కూడా కృష్ణరాజపురం నుంచే బయల్దేరుతుంది. దానాపూర్‌ డివిజన్‌లో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం పలు రైళ్లను దారి మళ్లించారు.

ఎర్నాకుళంలో బయల్దేరే ఎర్నాకుళం-పాట్నా 22643 ఎక్స్‌ప్రెస్‌ మార్చి 17 నుంచి 31 వరకు వయా ఆద్రా, నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌, గోమో, గయ మీదుగా ప్రయాణిస్తుంది. మార్చి 19న తిరుగు ప్రయాణంలో పాట్నా 22644 ఎక్స్‌ప్రెస్‌.. గయా, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, గోమో, ఆద్రా మీదుగా నడుస్తుంది.

సెంట్రల్‌ రైల్వేలో నిర్వహిస్తున్న పనుల కారణంగా 18520 ఎల్‌టిటి విశాఖ పట్నం- లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ 10గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. కారణంగా ఆదివారం విశాఖ రావాల్సిన ఎల్‌టీటీ ఆలస్యంగా చేరుకుంది. విశాఖ నుంచి రాత్రి 11.25 గంటలకు బయల్దేరాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం సాయంత్రం 6.30కి విశాఖ నుంచి బయల్దేరింది. విశాఖ నుంచి రావాల్సిన మరో రైలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story