కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కారు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సాంకేతిక లోపంతో ట్రాక్‌పై ఆగిపోయింది. కారు ఆగిన క్షణాల్లోనే గూడ్స్‌ రైలు కారును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. గూడ్స్‌ రైలు ఇంజిన్‌ భారతీ సిమెంట్‌ పరిశ్రమలో వ్యాగిన్లను వదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *