ట్రాక్‌పై ఆగిన కారు.. ఢీకొన్న గూడ్స్ రైలు
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2020 12:16 PM ISTకడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కారు రైల్వే ట్రాక్ దాటుతుండగా సాంకేతిక లోపంతో ట్రాక్‌పై ఆగిపోయింది. కారు ఆగిన క్షణాల్లోనే గూడ్స్ రైలు కారును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. గూడ్స్ రైలు ఇంజిన్ భారతీ సిమెంట్ పరిశ్రమలో వ్యాగిన్లను వదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story