ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి

By అంజి  Published on  29 Feb 2020 3:13 AM GMT
ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి

ముఖ్యాంశాలు

  • పాకిస్తాన్‌: హింద్‌రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం
  • బస్సును ఢీకొన్న రైలు, 30 మంది మృతి
  • 60 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా ప్రమాదం

దాయాది దేశం పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. హింద్‌ రాష్ట్రంలో ఓ ప్యాసింజర్‌ రైలు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 60 మందికిక తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు కొంత మంది అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం రోహ్రిప్రాంతంలోని రైల్వేగేట్‌ వద్ద జరిగింది.

కరాచీ నుంచి రావల్పిండికి రైలు వెళ్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో కరాచీ నుంచి బస్సు సర్గోదా వెళ్తుండగా రైల్వే క్రాసింగ్‌ వద్ద బస్సును రైలు ఢీకొట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. రైలు ఢీకొట్టడంతో బస్సు తుక్కు తుక్కు అయ్యింది. బస్సును రైలు దాదాపు 200 అడుగుల వరకు లాక్కువెళ్లింది. ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టామని సింధ్‌ సీఎం మురాద్‌ అలీ షా తెలిపారు. రైల్వే గేటు వద్ద సిబ్బంది లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.Next Story