ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.

By Kalasani Durgapraveen  Published on  10 Oct 2024 5:09 PM GMT
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. Paytm ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ప్రకటించారు. ధరలు రూ. 750 నుండి రూ. 15,000 వరకు ఉంటాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు తప్పనిసరిగా అక్టోబర్ 8 మరియు 12 మధ్య జింఖానా స్టేడియంలో టిక్కెట్‌లను రీడీమ్ చేసుకోవాలి.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీసులు అక్టోబర్ 12, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 గంటల మధ్య ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. వరంగల్‌ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే లారీలు, డంపర్‌లు, మట్టి తవ్వే వాహనాలు, ఆర్‌ఎంసీ ట్రక్కులు, వాటర్‌ ట్యాంకర్లతో సహా భారీ వాహనాలను చెంగిచెర్ల ఎక్స్‌ రోడ్డు-చెర్లపల్లి-ఐఓసీఎల్‌-ఎన్‌ఎఫ్‌సీ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. అదే విధంగా ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే వాహనాలను నాగోల్‌ మెట్రో స్టేషన్‌ మీదుగా హెచ్‌ఎండీఏ-బోడుప్పల్‌-చెంగిచెర్ల ఎక్స్‌ రోడ్డు, మల్లాపూర్‌ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ మీదుగా చెర్లపల్లి-చెంగిచెర్ల మీదుగా మళ్లిస్తారు. ప్రజలను సహకరించాల్సిందిగా అధికారులు కోరారు.

Next Story