రాజకీయ పార్టీలు క్రీడాకారుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు..రోహిత్ శర్మ వ్యవహారంపై మాండవీయ ఫైర్

క్రికెటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ , కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు

By Knakam Karthik
Published on : 3 March 2025 8:46 PM IST

Sports News, National News, RohitSharma, Congress Shama Mohamed, TMCs Saugata Roy, Union Sports Minister Mansukh Mandaviya

రాజకీయ పార్టీలు క్రీడాకారుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు..రోహిత్ శర్మ వ్యవహారంపై మాండవీయ ఫైర్

కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామా మొహమ్మద్ భారత క్రికెటర్ రోహిత్ శర్మ బాడీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె కెప్టెన్ రోహిత్ శర్మను అధిక బరువు ఉన్నాడని భారత్‌లో ఎన్నడూ లేని విధంగా ఆయన ఆకట్టుకోలేని కెప్టెన్"గా నిలిచాడని ఆయన వెంటనే బరువు తగ్గాలని.. న్యూజిలాండ్ పై విజయం తర్వాత ట్వీట్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై బీజేపీ, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలను ఖండించారు.

ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మపై టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ సౌగత రాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సౌగత రాయ్.. ఆమె చేసిన కామెంట్స్ తప్పేమి కాదన్నారు. అధిక బరువుతో బాధపడుతోన్న రోహిత్ ఫిట్‌గా లేడని.. అతడు జట్టులో ఉండకూడదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. మాట్లాడేది క్రికెట్ గురించి. రెండేళ్లకు ఒకసారి సెంచరీ సాధించడం, ఇతర మ్యాచ్‌లలో త్వరగా అవుట్ కావడం వల్ల జట్టులో రోహిత్ శర్మ స్థానం దక్కదు. అతను జట్టులో కెప్టెన్‌గా ఉండకూడదు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలు సరైనవే. నిజంగానే రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడు. కానీ ప్రజలు పట్టించుకోనట్లున్నారు" అని రాయ్ హాట్ కామెంట్స్ చేశారు.

క్రికెటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ , కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రీడాకారుల జీవితాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయ పార్టీలను ఆయన కోరారు. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు మరియు అథ్లెట్లపై ఉంచిన అనవసర పరిశీలనను మాండవియా ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు మాత్రమే కాదు, పూర్తిగా దయనీయమైనవి అని విమర్శించారు. మన క్రీడాకారుల గౌరవం, వృత్తి నైపుణ్యాన్ని మనం గౌరవించాలి' అని మాండవీయ ఎక్స్‌లో వేదికగా రాసుకొచ్చారు.

Next Story