పెరిగిన బస్ పాస్ చార్జీలు

By -  Nellutla Kavitha |  Published on  28 March 2022 12:45 PM GMT
పెరిగిన బస్ పాస్ చార్జీలు

ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో 10 వరకు ప్యాసెంజర్ సెస్ టికెట్‌ రేట్లను TSRTC పెంచింది. ఈ ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించడంతో ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇటీవలే చిల్లర సమస్య కారణంగా రౌండప్‌ విధానాన్ని తీసుకొచ్చిన TSRTC పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది TSRTC. ఈ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ఇంధన ధరలు, విడిభాగాలు, ట్యూబులు, టైర్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ ఖర్చుల భారం పెరిగి సంస్థకు నష్టం కలుగుతోంది కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో బస్ పాస్ చార్జీల పెంపు తప్పదని ప్రకటించింది. పెంచిన చార్జీల వివరాలు విడుదలచేసింది TSRTC. అయితే అకస్మాత్తుగా RTC ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story