ఆ రూట్ వందేభారత్‌లో కోచ్‌ల సంఖ్య పెంపు

సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ రూట్ ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ.

By Knakam Karthik  Published on  10 Jan 2025 12:25 PM IST
VANDEBHARAT, CENTRAL GOVERNMENT, MODI, CENTRAL RAILWAY, AP, TELANGANA

ఆ రూట్ వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందే భారత్ ట్రెయిన్స్‌కు చాలా ప్రయారిటీ లభించింది.ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ రూట్ ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రారంభమైన తొలి వందే భారత్‌కు ఆక్యుపెన్సీ రేషియోను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలును అప్‌గ్రేడ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు.

ఈ మేరకు ప్రస్తుతం 16 కోచ్‌లతో నడుస్తోన్న ఈ వందే భారత్ రైలు 20 కోచ్‌లతో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిత్య వెయిటింగ్ లిస్టు ఉంటోన్న ఈ రైలును ప్యాసింజర్స్‌కు వెసులుబాటు కలగనుంది. కొంతకాలంగా ఈ రైలులో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖకు వినతులు వచ్చాయి. దీంతో రద్దీకి అనుగుణంగా రైల్వే బోర్డు సూచించింది. ప్రస్తుతం మరో నాలుగు కోచ్‌లు పెంచుతూ అధికారులు నిర్ణయించారు.

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త వందే భారత్ ట్రెయిన్స్ ప్రతిపాదనలపైనా కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ రైళ్లను కేటాయించేలా రైల్వేశాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Next Story