రాడిసన్ హోటల్ దర్యాప్తు ముమ్మరం - లైసెన్ల్ రద్దు

By -  Nellutla Kavitha |  Published on  4 April 2022 3:45 PM GMT
రాడిసన్ హోటల్ దర్యాప్తు ముమ్మరం -  లైసెన్ల్ రద్దు

రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూల్స్ ను అతిక్రమించినందుకు ఎక్సైజ్ చట్ట ప్రకారం పబ్, బార్ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆదేశించారు.

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో కొకైన్ తో పాటుగా ఇతర మాదకద్రవ్యాలు వాడినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24 గంటల పాటు మద్యం సప్లై కి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. అయితే నిషేధిత కొకైన్ వాడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. జనవరి 21న మద్యం సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. యాభై ఆరు లక్షలు టాక్స్ చెల్లించి ఈ అనుమతి పొందింది. కాశీభట్ట అశోక్ పేరుతో లైసెన్సులు తీసుకున్నారు. అయితే కేవలం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మాత్రమే అమ్ముతాం అంటూ ఈ లైసెన్స్ వారు పొందారు. రాడిసన్ హోటల్ ను 2017లో కిరణ్ రాజు అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 ఆగస్టులో అభిషేక్, అనిల్ కుమార్, కిరణ్ రాజుకు లీజుకు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. హోటల్ మేనేజర్ అనిల్ కుమార్ తో పాటు గా అభిషేక్ ఉప్పాలను ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజు పరారీలో ఉన్నారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో గతంలోనే చెప్పామన్నారు మంత్రి. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని, డ్రగ్స్ వినియోగం పై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

డ్రగ్స్ నిర్ములనలో భాగంగా రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారన్నారు. నిబంధనలు పాటించని అన్ని పబ్ లు, బార్స్ పై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని బార్, పబ్ యజమానులను హెచ్చరించారు. డ్రగ్స్ రాకెట్ కు సంబందం ఉన్న ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story