MGM ఘటనలో ప్రభుత్వం సీరియస్ - డాక్టర్లపై వేటు

By -  Nellutla Kavitha |  Published on  31 March 2022 3:08 PM GMT
MGM ఘటనలో ప్రభుత్వం సీరియస్ - డాక్టర్లపై వేటు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ ను ఎలుకలు కొరికి, గాయపరచడం తో తీవ్ర రక్తస్రావమైంది. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎంజీఎం సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం ఆస్ప‌త్రికి వెళ్లిన ఓ రోగి కాలు, చేతి వేళ్ల‌ను ఎలుక‌లు కొరికివేశాయి. దీంతో అత‌డికి తీవ్ర ర‌క్త‌స్రావమైంది. డాక్టర్ల్ల్ నిర్లక్ష్యంపై బంధువులు మండిప‌డ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ కే ఇలా జ‌రిగితే, మిగ‌తా రోగుల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు, తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వివిధ విభాగాల అధిపతులు ఆర్ ఐ సి యు ఆస్పత్రి ప్రాంతమంతా క్షుణ్నంగా పరిశీలించారు. ఘటనకు గల కారణాలను వివరిస్తూ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

Next Story