తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  22 May 2024 5:49 AM GMT
Telangana, cm revanth reddy, Tirumala, darshan,

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 

తిరుమల శ్రీవారిని నిత్యం భక్తులు ఎంతో మంది దర్శించుకుంటూ ఉంటారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తాజాగా బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. తిరుమల ఆలయానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లను చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టెంట్రుకల మొక్కును చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు పడ్డాయని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరకుంటున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల వెంకటేశ్వరుడిని ప్రార్థించినట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరుకున్నట్లు చెప్పారు.


Next Story