టపాసులు తీసుకెళ్తే మూడేళ్ల జైలు శిక్ష.. రైల్వే శాఖ హెచ్చరిక

టపాసులు తీసుకెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. ట్రైన్‌లలో క్రాకర్స్‌ తీసుకెళ్తూ దొరికితే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది.

By అంజి  Published on  8 Nov 2023 11:00 AM IST
diwali, crackers, South Central Railway, APnews, Telangana

టపాసులు తీసుకెళ్తే మూడేళ్ల జైలు శిక్ష.. రైల్వే శాఖ హెచ్చరిక

దీపావళి.. హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. దీపావళి పండగ వచ్చిందంటే చాలు.. కాలనీల్లో, రోడ్లపై ఎక్కడ చూసినా బాణాసంచా మోతే వినబడుతుంది. పండుగకు రెండ్రోజుల ముందు నుండే పటాకులు కాల్చడం మొదలు పెడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పటాసులు పేల్చుతూ దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది టపాసులను నగరాల్లో కొనుక్కొని తమ గ్రామాలకు తీసుకెళ్తుంటారు. అందుకు బస్సులు, రైళ్లను ఆశ్రయిస్తారు. ఇలా టపాసులు తీసుకెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.

రైల్వే స్టేషన్లు, ట్రైన్‌లలో క్రాకర్స్‌ తీసుకెళ్తూ దొరికితే . రైల్వే చట్టం 1989 సెక్షన్‌ 164, 165 ప్రకారం రూ.1000 ఫైన్‌ లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. నేర తీవ్రతను బట్టి రెండూ ఉండే అవకాశం ఉందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తే 139 హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇటీవల రైళ్లలో అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నారు. అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Next Story