ప్రధాని మోడీఫై షర్మిల ఫైర్.

ప్రధాని మోడీ తీరు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందన్ని ఆంద్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  10 Oct 2024 5:40 PM IST
ప్రధాని మోడీఫై షర్మిల ఫైర్.

ప్రధాని మోడీ తీరు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందన్ని ఆంద్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది బీజేపీ అన్ని అన్నారు. బీజేపీ కుల,మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు చేసేదన్నారు. మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దర్జాగా దేశాన్ని దోచుకుంటూ..దోస్తులకు సంపదను దోచిపెడుతూ.. కాంగ్రెస్ ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోడీ అనడం సరికాదన్నారు. హర్యానాలో బీజేపీ విజయం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుందన్నారు .ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రజల మనసులో బలంగా నాటిన ప్రేమగా కాంగ్రెస్ ఉందన్నారు. నఫ్రత్ మరియు మొహబ్బత్ కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రేమనే గెలిచిందన్నారు. జమ్మూకాశ్మీర్ లో తెరుచుకున్న మొహబ్బత్ కి దుకాణ్ లు రేపు దేశం మొత్తం తెరుచుకుంటాయి అన్ని అన్నారు. కుల, మతాల మధ్య విభజన తెచ్చి ఊచకోత కోస్తుంటే..ఎదిరించిన గొంతుకలను, నక్సల్స్, టెర్రరిస్టులు, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతుంటే...హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని దేశం నమ్ముతుందన్నారు. ఈ నమ్మకమే 2029లో దేశాన్ని కాంగ్రెస్ నిలబెడుతుందని, ప్రధానిగా రాహుల్ గాంధీని దేశం చూస్తుందన్ని..అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య పడుతుందన్నారు.

Next Story