వారి సపోర్ట్ కూడా బీజేపీకే.. ఇక కాంగ్రెస్‌కు అక్కడ కష్టమే..!

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ, హర్యానాలోని హిసార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సావిత్రి జిందాల్ బీజేపీకి మద్దతునిచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  9 Oct 2024 9:33 PM IST
వారి సపోర్ట్ కూడా బీజేపీకే.. ఇక కాంగ్రెస్‌కు అక్కడ కష్టమే..!

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ, హర్యానాలోని హిసార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సావిత్రి జిందాల్ బీజేపీకి మద్దతునిచ్చారు. జిందాల్‌తో పాటు హర్యానాలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజేష్ జూన్, దేవేందర్ కడియాన్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేబ్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సావిత్రి జిందాల్‌తో సహా హర్యానాకు చెందిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ తెలిపారు.

బహదూర్‌గఢ్‌ నుంచి రాజేష్‌ జూన్‌ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి దినేశ్‌ కౌశిక్‌పై 41,999 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బీజేపీ రెబల్‌ దేవేందర్‌ కద్యన్‌ గనౌర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కులదీప్‌ శర్మపై 35,209 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సావిత్రి జిందాల్ హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో BJP అద్భుతమైన విజయం అందుకుంది. ఏకంగా 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పోరాటం 37 స్థానాలతో ముగిసింది.

Next Story