బ్రేకింగ్‌: సంగారెడ్డి: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున

By సుభాష్  Published on  10 Nov 2020 2:27 AM GMT
బ్రేకింగ్‌: సంగారెడ్డి: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనం వేగంగా ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సీఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్‌ రింగ్‌ రోడ్డులో వెళ్తున్నారు. పాటిగ్రామ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీట్టింది.

దీంతో బొలోరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఆరుగురు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసున మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story