మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్నా జిల్లాలో సోమవారం ఉదయం ఎదురెదురుగా వేగంగా వచ్చిన కారు - ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షుతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, గాయాలైన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. కాగా, ఓ సంతాప సభకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సుభాష్

.

Next Story