నా స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నా: ప్రధాని మోదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 9:46 AM IST
prime minister modi, comments, attack,  trump ,

నా స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నా: ప్రధాని మోదీ 

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన సంచలనంగా మారింది. ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా, అమెరికా మాజీ అధ్యక్షులు,వ్యాపారవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. హింసాత్మక ఘటనలకు తెరలేపడంపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన డోనాల్డ్ ట్రంప్.. 'నా స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసాత్మక ఘటనలు జరగడం బాధాకరం. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఇలాంటి హింసాత్మక ఘటనలకు అమెరికాలో చోటు లేదని అన్నారు. పెన్విల్వేనియాలోని ట్రంప్‌ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై సమాచారం అందిందని అన్నారు. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిశాకే.. తన మనసు కుదుటపడిందన్నారు. ఆయన్ని కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనల్ని ఖండించటంలో యావత్‌ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని బైడెన్ పేర్కొన్నారు.

Next Story